calender_icon.png 30 October, 2024 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 జిల్లాలకు డీఎంఅండ్‌హెచ్‌వోలు

30-10-2024 12:32:06 AM

నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులకు మంగళవారం ప్రభుత్వం ఇం చార్జి అధికారులను నియమించింది. ఆదిలాబాద్ జిల్లాకు డాక్టర్ నరేందర్, జనగామకు డాక్టర్ కే మల్లికార్జున్, జోగులాంబ గద్వాలకు డాక్టర్ ఎస్కే సిద్ధప్ప, ఖమ్మంకు డాక్టర్ బానోత్ కలావతి బాయి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు డాక్టర్ కే సీతారాం, మహబూబాబాద్‌కు డాక్ట ర్ జీ మురళీధర్, మహబూబ్‌నగర్ కు డాక్టర్ కే కృష్ణ, ములుగుకు డాక్టర్ కే గోపాల్‌రావు, పెద్దపల్లికి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి, సిద్దిపేటకు డాక్టర్ పవన్‌కుమార్, వికారాబాద్‌కు డాక్టర్ వై వెంకటరమణ, వన పర్తికి డాక్టర్ ఏ శ్రీనివాసులు, యా దాద్రి భువనగిరి జిల్లాకు డాక్టర్ ఎం మనోహర్‌ను ఇంచార్జి డీఎంఅండ్‌హెచ్‌వోగా నియమిస్తూ వైద్యా రోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆదేశాలు జారీచేశారు.