calender_icon.png 11 March, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దవాఖానను తనిఖీ చేసిన డీ.ఎం.అండ్.హెచ్.ఓ

26-11-2024 10:34:10 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో గల దవాఖానను మంగళవారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ హరీష్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రతిరోజు 50 నుండి 60 వరకు ఓపి పేషెంట్లు వైద్యం కోసం వస్తుండడంతో వైద్యాధికారులు ఓపి రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. దవాఖానలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యులు డాక్టర్ సుమంత్ రెడ్డి, డాక్టర్ సుమలత, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.