29-03-2025 11:01:58 PM
మహిళా ఉద్యోగులను వేధింపులకు పాల్పడినందుకే ఈ చర్య..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బి రతన్ రాజును సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ బి రవీంద్ర నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎం అండ్ షో కార్యాలయానికి చేరాయి. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులను వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై అతని సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్డర్లో పేర్కొన్నారు.