12-03-2025 05:29:02 PM
పార్లమెంట్ లో ప్రస్తావించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) అన్నారు. బుధవారం పార్లమెంటులో జీరో అవర్ సమయంలో ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Education Minister Dharmendra Pradhan)ను ఎంపీ డీకే అరుణ పలు అంశాలను తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, కొడంగల్, జోగులాంబ గద్వాల నియోజకవర్గ కేంద్రాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పిల్లలకు నాణ్యమైన మంచి విద్య మన కేంద్రియ విద్యాల ద్వారా అందుతున్న విషయం అందరికి తెలుసన్నారు. ఈ కేంద్రీయ విద్యాలయల ఏర్పాటుకు అవసరమైన వనరులు, భూమి మా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అందుబాటులో ఉన్నదన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రమంత్రి ని కోరారు.