11-02-2025 11:52:21 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహాబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఖండించారు. రంగరాజన్ కు డీకే అరుణ ఫోన్ లో పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యుడైన రాఘవరెడ్డిపై కఠిన చర్చలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామరాజ్యస్థాపన ముసుగులో ఇలాంటి ఘటనలకు పాల్పడడం సరికాదని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2022లో వీరరాఘవరెడ్డి 'రామరాజ్యం'ను ప్రారంభించాడని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని డీసీపీ తెలిపారు. రామరాజ్యంలో చేరితే రూ.20 వేలు జీతం ఇస్తానంటూ తణుకు, కోటప్పకొండలో వీరరాఘవ రెడ్డి పర్యటించాడు. రామరాజ్యంలో చేరిన వారంతా యూనిఫామ్ కుట్టించుకోమమన్నాడు. ఈనెల 6వ తేదీన అందరూ యాప్రాల్ లో కలిశారని రాజేంద్రనగర్ డీసీపీ వ్యాఖ్యానించారు. రామరాజ్యం బ్యానర్ తో ఫోటోలు, వీడీయోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈనెల 7న మూడు వాహనాల్లో చిలుకూరు వచ్చిన వీరరాఘవ రెడ్డి తమకు ఆర్థికంగా సాయం చేయాలని రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన అర్చకుడు రంగారాజన్ అందుకు నిరాకరించడంతో పూజారిపై దాడి చేశారని డీసీపీ వివరించారు.