calender_icon.png 23 December, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీఫైనల్లో జొకోవిచ్

12-10-2024 12:00:00 AM

షాంఘై: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జొకోవిచ్ 6-7 (4/7), 6-1, 6-4తో మెన్సిక్‌ను ఓడించాడు. 2 గంటలకు పైగా సాగిన పోరులో జొకోవిచ్ 7 ఏస్‌లు, 12 విన్నర్లు సంధించాడు.

కాగా మెన్సిక్ 32 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ 6-3, 6-4తో గాఫిన్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకున్నాడు. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో సిన్నర్‌తో మెక్‌హక్, జొకోవిచ్‌తో టేలర్ అమీతుమీ తేల్చుకోనున్నారు.