calender_icon.png 30 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొకోవిచ్ చరిత్ర

01-08-2024 01:29:41 AM

క్వార్టర్స్‌లో సెర్బియా వీరుడు

పారిస్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించేందుకు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరింత దగ్గరయ్యాడు. బుధవారం జొకోవిచ్ 7 6 డొమినిక్ కొఫెర్ (జర్మనీ)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకొని నాలుగోసా రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికసార్లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచిన జొకోవిచ్‌కు ఒలింపిక్స్‌లో స్వర్ణం మాత్రం అందని దాక్ష్రగానే మిగిలిపోయింది.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో జొకోవిచ్ కాంస్యంతో మెరిశాడు. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్  క్రీడల్లో ఎలాగైనా స్వర్ణం సాధించి  కెరీర్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇక క్వార్టర్స్‌లో జొకోవిచ్ గ్రీక్ టెన్నిస్ స్టార్ సిట్సిపాస్‌ను ఎదుర్కోనున్నాడు. సిట్సిపాస్ అర్జెంటీనాకు చెందిన సెబాస్టియన్ బేజ్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6 6 చైనాకు చెందిన వాంగ్ గ్జియూను చిత్తుగా ఓడించింది.