calender_icon.png 20 January, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొకో జోరు

05-07-2024 01:38:24 AM

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ జోరును కొనసాగిస్తున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించే క్రమంలో జొకో మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ పెగులాతో పాటు నవోమి ఒసాకా ఇంటిబాట పట్టగా.. జబుర్,  ఒస్టాపెంకా ముందంజ వేశారు.

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ 6 6 5 7 వైల్డ్‌కార్డ్ ప్లేయర్ ఫియర్ల్నీ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. మూడు గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరులో 14 ఏస్‌లు కొట్టిన జొకో 4 బ్రేక్ పాయింట్లు గెలుచుకున్నాడు. ఐదు డబుల్ ఫాల్ట్ చేసిన జాకబ్ 49 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

ఇతర మ్యాచ్‌ల్లో 9వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6 6 7 జామ్ మునార్‌పై, మొన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 7 (7 6 7 (7/3)తో వావ్రింకాపై విజయాలు సాధించగా.. ఏడో సీడ్ హుర్కాజ్ 6 4 6 6 ఆర్థర్ ఫిల్స్ చేతిలో పరాజయం చవిచూశాడు. మూడు గంటల 30 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో హుర్కాజ్ 56 అనవసర తప్పిదాలు చేసి ఓటమిని మూటగట్టుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది.

పెగులా 4 7 (9/7), 1 చైనాకు చెందిన వాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. జపాన్ టెన్నిస్ స్టాన్ నవోమి ఒసాకా కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ జాబుర్ , 13వ సీడ్ ఒస్టాపెంకా, స్వితోలినాలు మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు. ఇక డబుల్స్ విభాగంలో భారత స్టార్ యూకీ బాంబ్రీ (ఫ్రాన్స్) జోడీ రెండో రౌండ్‌కు చేరింది.