జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, (విజయ క్రాంతి): వినాయక నవరాత్రోత్సవాల్లో డీజే సౌండ్ సిస్తాలను ప్రభుత్వo ఆదేశాల మేరకు నిషేధిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో డీజే నిర్వాహకులతో పోలీసులు సమావేశాలు నిర్వహించారు. డీజే సౌండ్ సిస్టాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం సంభవిం చే అవకాశాలు ఉన్న దృష్ట్యా రానున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఇకపై డీజేసౌoడ్ వినిపించొద్దని జగిత్యాల సీఐ వేణుగోపాల్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించబడిన డీజే సౌండ్ సిస్టంను ఎట్టి పరిస్థితుల్లోనూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పెట్టరాదని ఒకవేళ పెట్టినచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీజే సౌండ్ సిస్టం నిర్వాహకులను అర్బన్ మండల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.