calender_icon.png 30 October, 2024 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివాళీ మెరుపు తీగలు

24-10-2024 12:00:00 AM

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి పార్టీలో బాలీవుడ్ తారలోకం సందడి చేసింది. తారలంతా ఒకేచోట చేరి  దీపావళి దుస్తుల్లో జిగేల్‌మనిపించారు. ఈ పార్టీకి బీ టౌన్ హీరోయిన్స్ హాజరుకాగా, బాలీవుడ్ బ్యూటీ, దేవర ఫేం జాన్వీకపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అనేక బ్లాక్ బ్లస్టర్ బాలీవుడ్ సినిమాలకు మల్హోత్రా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన బాలీవుడ్ దిగ్గజ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎదిగారు. ఏ సినీ వేడుకకు అయినా తారలంతా మనీష్ డిజైన్ చేసిన దుస్తులే ధరిస్తారనేది తెలిసిందే. ఈ పండుగకు మీరు కూడా బాలీవుడ్ భామల ఫ్యాషన్‌ను ట్రై చేయండి మరి!

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ డార్క్ బ్లూ చీరలో అందంగా మెరిసిపోయింది. చీరంతా చమ్కీలతో నిండిపోయింది.

దిశాపటానీ

డార్క్ గోల్డెన్ కాటన్ పట్టు చీరపైకి ఫుల్‌వర్క్‌తో ఉన్న స్లివ్‌లెస్ బ్లౌజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కృతి సనన్

కృతి సనన్ పసుపు రంగు చీరపైకి డైమండ్ వర్క్ బ్లౌజ్‌తో దేవకన్యను తలపించింది.

అలియా భట్

పింక్ కలర్ గగ్రాలో మెరిసిపోయింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై గోల్డెన్ కలర్ ఫ్రింట్ వర్క్ అదిరిపోయింది.

శోభితా ధూళిపాళ్ల

పార్టీలో శోభితా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మల్టీకలర్ చీరపైకి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో తలుక్కుమన్నది.