calender_icon.png 24 December, 2024 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకట్లు నింపిన దీపావళి

02-11-2024 02:28:39 AM

  1. సరూర్‌నగర్‌లో పటాకుల నిప్పురవ్వలు పడి ఫర్నిచర్ షాపు దగ్ధం
  2. వినాయక్‌నగర్‌లో అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో చెలరేగిన మంటలు

ఎల్బీనగర్, నవంబర్ 1: దీపావళి సంబురాలు పలుచోట్ల చీకట్లు నింపాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతా ల్లో గురు, శుక్రవారాల్లో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సరూర్ నగర్‌లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వా త పటాకుల నిప్పురవ్వలు పడటంతో ఉర్దూ పాఠశాల సమీపంలోని ఈస్ట్ ఉడ్ ఫర్నీచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి.

ఎల్బీనగర్ అదనపు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో నాలుగు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యజమాని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాణాసంచా పేలుళ్లతోనే ఫర్నీచర్ షాపులో మంటలు చేలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హయత్ నగర్ డివిజన్‌లోని వినాయక్ నగర్‌లో పిన్నింటి సత్తిరెడ్డికి చెందిన అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో శుక్రవారం తెల్ల వారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కుని మంటలను ఆర్పేశారు.  కాగా ఈ ప్ర మాదంలో ఫ్ల్లాట్‌లో ఉంటున్న యూపీకి చెం దిన అనిల్ సహాని(21) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరా లేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.