calender_icon.png 28 September, 2024 | 4:55 AM

రుణమాఫీకి దీపావళి డెడ్‌లైన్

28-09-2024 02:15:29 AM

చేపట్టని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తాం

రైతు ధర్నాలో మాజీమంత్రి హరీశ్ రావు 

సిద్దిపేట, సెప్టెంబరు 27 (విజయక్రాంతి): అధికారం చేజిక్కించుకునేందుకు అమలు కాని హామీలిచ్చి ప్రజలకు ఎగనామం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో చేపట్టిన రైతు ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు రుఫమాఫీ చేస్తామని హమీ ఇచ్చి.. లేనిపోని కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ పార్టీ దీపావళి వరకు డెడ్‌లైన్ విధిస్తోందన్నారు. ఆలోపు పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం అని హరీశ్‌రావు హెచ్చరించారు.

కేసీఆర్ సీఎం అయ్యాకనే తెలంగాణలో భూముల విలువ పెరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరుతో డ్రామలు ఆడుతుండటంతో హైదరాబాద్ సహా శివారుల్లో భూములు కొనేవాడు లేడని విమర్శించారు. కాగా రైతు ధర్నాలో రుణమాఫీ కాలేదని 2,900 ధరఖాస్తులు వచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్‌ఎస్ నాయకులు.. రాధాకృష్ణ శర్మ, సారయ్య, రమేశ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డి, మల్లయ్య, రెడ్డి యాదగిరి, పడిగె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.