- 27న రిటైర్డ్ కార్మికుల ఖాతాల్లో జమ
- సింగరేణి సీఎండీ బలరామ్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): సింగరేణిలో 2023 ఆర్థిక సంవత్సరంలో, 2024 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్యలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్ (దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. ఈ మొత్తం రిటైర్డ్ కార్మికుల ఖాతాల్లో ఈనెల 27 తేదీన జమ అవుతుందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2,754 మంది కార్మికులకు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ. 93,750 చొప్పున సంస్థ చెల్లించనుంది. ఇందుకు గానూ మొత్తం రూ.18.27 కోట్లను విడుదల చేసింది.