అనంతపురంలో ఘటన
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): ఏపీలోని అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపం లో మొత్తం నాలుగు బస్సులను నిలిపి ఉంచగా, గురువారం తెల్లవారుజామున ఒక టి పూర్తిగా దగ్ధమైంది. మరొకటి పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా? లేక ఆకతాయిల పనా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.