మంచిర్యాల: మంచి మంచిర్యాలని మాఫీయా మంచిర్యాలగా ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు మారుస్తున్న మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఈ సదర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల అంటే మంచితనానికి నిలయమైన మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల నుండి జరుగుతున్న ఘటనలపై ఆయన మండిపడ్డారు. మంచిర్యాల స్థానిక ఎంఎల్ఎ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అండదండలతో భూకబ్జాలు, రౌడీయిజాలు, వ్యక్తుల మీద దాడులు, జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అసాంఘిక ఘటనలకు తెరలేపిన, అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న ప్రేమ్ సాగర్ రావుపై దివాకర్ రావు నిప్పులు చెరిగారు.