మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి) : బీజేపీ చేస్తున్న విభజన రాజకీయా లను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టి.. కాం గ్రెస్ కూటమిని గెలిపించాలని ఏఐసీసీ పరిశీలకుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరా రు. మహారాష్ట్రకు చెందిన 17 పారిశ్రామిక ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించుకుపోయిన ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాందేడ్, లాతుర్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరైన లాతుర్ సభలో ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. కూటమి విజయం సాధిస్తే ఐదు హామీలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. రైతులకు రూ.3లక్షల రుణమాఫీ, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.50వేల బోనస్ ఇస్తామని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన మహానేతలు ఛత్రపతి శివాజీ మహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే, అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు దేశ భవిష్యత్తును మలుపు తిప్పుతుందన్నారు.