హైదరాబాద్, నవంబర్ 9: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దివీస్ లాబొరెటరీస్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 46% వృద్ధిచెంది రూ. 510 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ.348 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం 22.5 శాతం పెరిగి రూ.1,909 కోట్ల నుంచి రూ. 2,338 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో రూ.29 కోట్ల విదేశీ మారక లాభాల్ని ఆర్జించడంతో నికరలాభం అధికంగా నమోదయ్యింది.