calender_icon.png 31 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిధులు దారిమళ్లింపు

31-10-2024 01:31:05 AM

ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను రేవంత్ సర్కార్ పక్కదారి పట్టిస్తోందని మెదక్ ఎంపీ ఎం రఘునందన్‌రావు ఆరోపించారు. రూ. వెయ్యి కోట్ల గ్రామీణ నిధులను అక్రమంగా ఇతర పథకాలకు వాడుకు న్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

6 నెలల క్రితం కేంద్రం రాష్ట్రానికి రూ.1,200 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయగా.. కేవలం రూ.200 కోట్లను ఖర్చుచేసి మిగిలిన నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. ఆ బిల్లులు ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.600 కోట్లు పెండింగ్‌లో పడ్డాయన్నారు.  మున్సిపాలిటీల్లో తాగు నీటి కోసం కేంద్రం రూ.250 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.

ఇందిరమ్మ కమిటీల చట్టబద్ధతపై ప్రశ్నించారు. నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పి.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అర్బన్ మిషన్ కిందే నిధులు సేకరిస్తోందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఎప్పుడో రిటైర్‌మెంట్ ఇచ్చారని రఘునందన్ ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారన్నారు. మరోవైపు రేవ్ పార్టీ లంటూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్న ట్లు ఆక్షేపించారు. జన్వాడ ఫాంహౌస్ కేసులో నిందితులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తామన్నారు.