calender_icon.png 28 December, 2024 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐతో విభిన్న విద్యావసరాలు

24-09-2024 12:00:00 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాధనాలు భారతీయ వి ద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసు కు వస్తున్నాయి. ఇవి ఆటోమేటెడ్ గ్రేడింగ్, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం, తక్షణ అభిప్రాయం వంటివాటి ద్వారా విద్యార్థులు నే ర్చుకునే విధానాన్ని మెరుగు పరుస్తున్నాయి. ఏఐ సాంకేతికత విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా విద్యను రూపొందిం చడంతోపాటు సమర్థవంతమైన అభ్యాసా న్ని అందించడంలోనూ చక్కగా సహాయపడుతున్నది. మరోవైపు ఏఐ ఉపాధ్యాయుల కు పాఠ్య ప్రణాళికలు, విజువల్స్, ఇంటరాక్టి వ్ కంటెంట్ తయారీలో తోడ్పడటంతో బో ధనను వేగవంతం చేస్తున్నది. గ్రేడింగ్ వంటి సాధారణ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఉపాధ్యాయులకు సృజనాత్మక బోధనకు ఎక్కువ సమయం దొరుకుతున్నది.

ఒక సర్వే ప్రకారం, 60% మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఏఐ టూల్స్ ఉపయోగి  స్తున్నారు. 64.87% మంది ఏఐ విద్యను వ్యక్తిగతీకరించడంలో కీలకమని భావిస్తుండగా, 70.85% మంది ఏఐ ప్రభావం స్మార్ట్ ఫోన్ విప్లవం కంటే గొప్పదిగా ఉంటుందని అంటున్నారు. అయితే, 87.85% మంది ఏఐ వల్ల తలెత్తే నైతిక సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన చెందుతున్నారు. 

సమాన విద్యావకాశాలను అందించడానికి, ఏఐ ఆధారిత పద్ధతులు పాఠ్యాంశాల ను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించడం, బోధన విధానాలను మెరుగు పరచడం, గ్రేడింగ్ వ్యవస్థలను ఆటోమేటెడ్ చేయడం ద్వారా విద్యార్థులకు సహాయపడతాయి. ఏఐ విద్యా రంగంలో సమానతను పెంచడానికి, ప్రతి విద్యార్థి ప్రత్యేక అవసరాలను తీర్చడానికి కీలకంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 డా. కృష్ణకుమార్ వేపకొమ్మ