calender_icon.png 16 January, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా పైపు కల్వర్టు

16-01-2025 12:40:50 AM

* నీటి మట్టానికన్నా ఎత్తుగా నిర్మాణం l వృథాగా ఉన్న కల్వర్టు

రేవల్లి, జనవరి15:  మండల పరిధిలోని నాగపూర్ శివారులోని బిక్కుబాయి దగ్గర గత కొన్ని రోజుల క్రితం నిర్మించిన వరద నీరు, కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లు రోడ్డు దాటడానికై నిర్మించిన పైపు కల్వర్ట్ ను నీటి ప్రవాహం దగ్గర కాకుండ నీటిమట్టానికి ఎత్తులో ఈ పైపు కల్వర్ట్ నిర్మించడం వల్ల లక్షల రూపాయల ప్రజా ధనం, కల్వర్టు వధాగ మారింది, నీళ్లు రోడ్డు దాటేందుకు ఇక్కడ గతంలో ఉన్న రోడ్డు డ్యామ్‌ను దురుద్దేశపూ ర్వకంగా కొందరు ధ్వంసం చేసి మూసి వేయగా రోడ్డు నిర్మాణంలో భాగం గా దాని స్థానం మారింది, దీనివల్ల తమ పట్టా, పంట  పొలాలు పాడవుతున్నాయని మం డల, జిల్లా అధికారు లకు నివేదించిన పట్టించుకోకపో అక్కడ నష్టపోతున్న రైతులు న్యాయస్థానాన్ని  ఆశ్రయించారు.

గత కొన్నిరో జుల క్రితం వారికున్న ఆదేశాల ప్రకారం అఘామేఘా లపైన అక్కడ పైప్ కాల్వర్ట్‌ను నిర్మించి చేతులు దులుపు కున్నారు, నీళ్లు వెళుతున్నాయా లేదా అని ఎవ్వ రూ కూడా తిరిగి చూసుకోలేదు, దీంతో అక్కడ పైప్ కాల్వర్ట్ వేసి కూడ నిరూపయోగంగా మారింది.