calender_icon.png 10 January, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా చేపల మార్కెట్

10-01-2025 12:00:00 AM

  • రూ.10లక్షలతో నిర్మాణం

మందుబాబులకు అడ్డాగా మారిన భవనం

వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్న స్థానికులు

పటాన్‌చెరు, జనవరి 9 : జిన్నారం మండల కేంద్రంలో లక్షల రూపాయలతో నిర్మించిన చేపల మార్కెట్ నిరుపయోగం గా మారింది. మత్స్యకారుల ఆర్థిక అభివృ ద్ధి కోసం అవసరమైన సౌకర్యాలతో ఆధుని కంగా నిర్మించిన చేపల మార్కెట్ వినియో గంలో లేకపోవడంతో  అనుకున్న లక్ష్యం నీరుగారుతోంది.

వివరాలలోకి వెళ్తే.... మండల కేంద్రం జిన్నారం శివారులోని సర్వే నంబర్ 1002లో మినీ స్టేడియం పక్కన మత్స్య పారిశ్రామిక సహకార సం ఘం మార్కెట్ భవన నిర్మాణం కోసం 2018లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి మత్స్య శాఖ ద్వారా రూ.10 లక్షలు మం జూరయ్యాయి.  చేపల మార్కెట్ భవనాన్ని ఎమ్మెల్యే 2023 సెప్టెంబర్ 28న ప్రారం భించారు. 

మత్స్యకారులను ఆర్థికంగా అభి వృద్ధి చేసేందుకు, నీలి విప్లవానికి జిన్నా రం మండలం వ్యాప్తంగా మరింత ప్రాధా న్యత కల్పించే  లక్ష్యంతో ఈ మార్కెట్ ను నిర్మించారు.  కాగా చేపల మార్కెట్ నిర్మిం చి 14 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దానిని వినియోగంలోకి తీసుకురాలేదు.  ఏ లక్ష్యంతో ఈ చేపల మార్కెట్‌ను ప్రభుత్వం నిర్మించిందో ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

పైగా చేపల మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారింది.  మద్యం ప్రియులు చేపల మార్కె ట్ భవనాన్ని మద్యం సేవించేందుకు అడ్డాగా చేసుకున్నారు.  జిన్నారంలో ప్రతి బుధవారం జరిగే అంగడిలో చేపల విక్రయాలు కూడా జరుగుతుంటాయి. 

చేపల మార్కెట్ భవనంలో బుధవారం తో పాటు ప్రతిరోజు చేపల విక్రయాలు నిర్వహించాలని చేపల ప్రియులు, వివిద గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  రూ.10 లక్షలతో నిర్మించిన ఈ చేపల మార్కెట్ వినియోగంలో లేకపోతే శిథిలావస్థకు వస్తుందని,  జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించి దీనిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.