calender_icon.png 10 January, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతలకు విఘాతం..

07-09-2024 12:39:56 AM

13 మందిపై కేసు

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగి స్తున్న ఒకే గ్రామంలోని 13మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ మండలం బొందలపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మల్లెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన మధవరెడ్డి రాజ కీయ ప్రత్యర్థులు. తమ రాజకీయ లబ్ధికోసం గ్రామంలో చిన్నపాటి గొడవలు జరిగినా రాజకీయ రంగుపులిమి వారి అనుచరులను రెచ్చగొడుతూ గొడవలకు కారకులవుతున్నారు. తాజాగా యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీనివాస్‌రెడ్డి, మాధవరెడ్డి తోపాటు మరో 11మందిపై కేసులు నమో దు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.