calender_icon.png 21 September, 2024 | 5:36 AM

నేటి నుంచి జిల్లాలవారీగా సమీక్షలు

21-09-2024 01:51:29 AM

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ శ్రీకారం 

పార్టీపై పట్టు సాధించే దిశగా అడుగులు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీలో తన కుంటూ ఒక మార్క్‌ను చూపించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతు న్నారు. ఒకవైపు పార్టీ కేడర్‌ను  సిద్ధం చేస్తూ నే మరోవైపు తన పట్టును పెంచుకునేందుకు పీసీసీ చీఫ్ రెడీ అవుతున్నారు. అందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలతో గాంధీభవన్ వేదికగా సమీక్షలకు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాథ్‌తో పాటు డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అనుబంధ సంఘాల నాయకులతో పాటు ముఖ్య నాయకులు కూడా జిల్లాల వారీగా సమీక్షలకు హాజరుకానున్నారు.

రోజుకు రెండు లేదా మూడు జిల్లాల చొప్పున సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నారు. ఇప్పటికే  సీఎం రేవంత్‌రెడ్డి నెలకోసారి, మంత్రులు వారానికి రెండు రోజులు గాంధీభవన్‌కు రావాలని పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ప్రతిపాదన చేశారు. అందుకు తగినట్లుగానే బుధ, శుక్రవారాల్లో వారానికి ఒక మంత్రి గాంధీ భవన్‌కు వచ్చే విధంగా కార్యాచరణను సిద్ధమైంది. వచ్చే వారం నుంచి గాంధీభవన్‌కు మంత్రు లు వచ్చే కార్యక్రమం అమలు జరగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

నేడు సమీక్షలు నిర్వహించే జిల్లాలు

పార్టీ నేతలతో మొదటి రోజు మూడు జిల్లాలల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు వరంగల్ జిల్లా, మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.