హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): గాంధీభవన్‌లో నేడు, రేపు జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్న ట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మం గళవారం ఉదయం 11 గంటల నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా పార్టీ స మావేశాలు ఉంటాయని ఆయన వివరించారు. బుధవారం హైద రాబాద్ జిల్లా పార్టీ సమావేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సం ఘాల అధ్యక్షులు, చైర్మన్‌ల సమా వేశం ఉంటుందని వెల్లడించారు.