calender_icon.png 21 September, 2024 | 8:21 PM

జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలి

21-09-2024 01:17:13 AM

ఎస్సీ కమిషన్ మాజీ  చైర్మన్ పిడమర్తి రవి

నారాయణ పేట, సెప్టెంబరు 20(విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేయాలని ఎస్సీ కమిషన్ మాజీ చై ర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమ ర్తి రవి డిమాండ్ చేశారు. మాదిగల మేలుకొలుపు యాత్ర శుక్రవారం నారాయణపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12 శా తం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రా ష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కమిటీ వే యడం హర్షనీయం అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలు, లంబాడీలు, మాలలు, ముదిరాజులకు చోటు కల్పించాలని కోరా రు.

పెరిగిన జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేయాలని, జిల్లాల వారీగా వర్గీకరణ చే పట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో మాదిగల మేలుకొలుపు యాత్ర ఉంటుందని తెలిపా రు. ఈ నెల 30న భువనగిరలో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అ ంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షుడు మహేష్, మాదిగ జేఏసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.