31-03-2025 04:02:18 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్
బూర్గంపాడు,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు సోమవారం బూర్గంపాడు మండలం సారపాక పెద్ద మస్జిద్ ఎ దావత్ ఈద్గా తాళ్లగుమ్మూరులో ఈద్-ఉల్-ఫితర్ నమాజ్(Eid-ul-Fitr Prayer)ను ముస్లిం మత పెద్దలతో, ముస్లిం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ నమాజును పాటించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ... మానవాళి హితాన్ని ఆకాంక్షించే పవిత్రమైన రంజాన్ పర్వదినం అందరిలోను సోదర భావాన్ని పెంపొందించిందన్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. అనంతరం సుమారు 700 మంది ఈద్గాలో ప్రశాంతమైన వాతావరణంలో నమాజును పాటించి ఒకరిని ఒకరు కలింగం చేసుకొని ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపుమేరకు బిజెపి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్ 2024 సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లను ధరించి నిరసనను వ్యక్తం చేస్తూ వక్ఫ్ ఆస్తులు అంటే వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజంలోని ధార్మిక, సాంస్కృతిక, సామాజిక అవసరాలను తీర్చడానికి వ్యక్తులు లేదా సంస్థలు దానం చేసిన ఆస్తులు. ఇవి మసీదులు, మదర్సాలు, సమాధులు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి సంస్థల నిర్వహణకు ఉపయోగపడతాయని ఈ ఆస్తులను నిర్వహించడం కోసం వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి అన్న విషయం బిజెపి కేంద్ర ప్రభుత్వం నాయకులు తెలుసుకోవాలని అన్నారు.