19-03-2025 02:43:11 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి18 ( విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19న హైదరాబాద్ బోయినపల్లిలోని వాటర్ స్పోరట్స్ అకాడమీలో ఐదవ తరగతి ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు జిల్లా నుండి పదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు. మంగళవారం హైద రాబాద్‌కు ప్రత్యేక వాహనలలో విద్యార్థులు బయలుదేరారు. గిరిజన క్రీడల అధికారి బండ మీనారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలోని గిరిజన ఆదర్శ బాలికల వీరా పాఠశాల నుండి ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇందిరా, మహాదు,వెంకటేష్, సాయిబాబా, లక్ష్మణ్, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్ పాల్గొన్నారు.