calender_icon.png 1 February, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో రాణించిన జిల్లా విద్యార్థులు

01-02-2025 08:24:45 PM

మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన ఇంగ్లీష్ ఒలంపియాడ్, ఉపన్యాస పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఛాంబర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రస్థాయిలో ఇంగ్లీష్ ఒలంపియాడ్ స్క్రీమ్-టు విభాగంలో ఎమ్ సంజన (టిఎస్ఎంఎస్ మంచిర్యాల) ప్రథమ స్థానంలో నిలువగా, ఉపన్యాస విభాగంలో ఏ అభివర్థిని (టిఎస్ఎంఎస్ కాసిపేట) ద్వితీయ, ఉపన్యాస పోటీ స్ట్రీమ్-వన్ విభాగంలో ఎస్ అరవింద రాణి (జిల్లా పరిషత్ పాఠశాల కిష్టాపూర్) తృతీయ బహుమతులను గెలుచుకున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ అండ్ ఓ ఎస్ సి కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఇంక్లూజివ్ కమ్యూనిటీ మొబైల్ కో ఆర్డినేటర్ చౌదరి, జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తయ్య జంబోజు, ప్రధాన కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు సన్మాన గ్రహీతలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.