మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ లోని కేజిఏ డిఫెన్స్ అకాడమీ మైధానంలో జనవరి 27న జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి రగ్బీ పోటీలలో మంచిర్యాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ కరస్పాండెంట్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రణయ్, రెహన్, యశ్వంత్, హిమాప్రియ, సుహానా, తేజశ్వినిలు పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు కొట్టె దేవేందర్, కార్తీక్, ఉపాధ్యాయులు అభినందించారు.