calender_icon.png 1 February, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంగ్ల ఒలంపియాడ్ లో రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థి ప్రతిభ..

01-02-2025 07:27:45 PM

మంచిర్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి ఆంగ్ల ఒలంపియాడ్ లో మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. 33 జిల్లాలల నుంచి విద్యార్థులు పోటీ పడగా ఆంగ్ల ఒలంపియాడ్ లో మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ఆదర్శ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఎం. సంజన ప్రథమ స్థానంలో పిలిచింది. డీఈవో కార్యాలయంలో శనివారం సంజనను జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న, ఆంగ్ల ఉపాధ్యాయులు డి సరిత, డి రమేష్, టి రజిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.