calender_icon.png 21 December, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపేట పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ యోగేష్ గౌతమ్

11-09-2024 09:09:54 PM

నారాయణపేట,(విజయక్రాంతి): రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్, నారాయణపేట నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న, SHO గది, ఫిర్యాదుదారుల గది, పోలీస్ సిబంది విశ్రాంతి గదిని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు, ఫినిషింగ్ వర్కు వేగవంతంగా, త్వరగా పూర్తిచేయాలని, పోలీస్ స్టేషన్లో ఉపయోగించే ఫర్నిచర్ ఇతర స్టేషనరీని నాణ్యమైనవి ఉపయోగించాలని అధికారులకు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రజలకు త్వరలో సమర్థవంతంగా సేవలు అందించడానికి నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట సీఐ శివశంకర్, ఎస్సై రాముడు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.