calender_icon.png 16 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జల్సాల కోసం దోపిడీలు చేస్తే.. జీవితాంతం జైలుకూడు తప్పదు

15-03-2025 11:43:33 PM

మరో ఇద్దరు పరారీ, 24 కేసుల్లో నిందితులుగా గుర్తింపు.

10 తులాల బంగారం, 22 తులాల వెండి, ఒక కారు, 2 బైకులు, 7 సెల్ ఫోన్ లు స్వాధీనం...

మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడి...

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జల్సాలతో పాటు మద్యానికి బానిసలుగా మారిన కొందరు యువకులు దారిదోపిడికి యత్నించారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామ శివారులో ఈనెల 6న చోటు చేసుకుంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించి మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు హరార్ లో ఉన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు.

కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లికి చెందిన బంగారు, వెండి దుకాణాల వ్యాపారస్తులు ప్రతి గురువారం మార్కెట్ సెలవు కావడంతో వ్యాపార నిమిత్తం బంగారం వెండి కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో పెంట్లవెల్లి ప్రాంతానికి చెందిన రాజ వర్ధన్, వెంకటేశ్వర్లు, రమేష్, రామచంద్రాచారి అనే నలుగురు వ్యక్తులు ఈనెల 6న బంగారం కొనుగోలు కోసం ఓ కారులో హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన పెంట్లవెల్లి ప్రాంతానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తి వనపర్తి జిల్లా శ్రీనివాసపురం కాలనీకి చెందిన బొల్లెమోని బాబు, బుల్లెమోని అంజి, పుట్టపాకుల శ్రీకాంత్, హైదరాబాద్ లోని అంబర్ నగర్ ప్రాంతానికి చెందిన నందిమల్ల హరి గణేష్, హైదరాబాద్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంతానికి చెందిన యాత రవి, పెంట్లవెల్లి గ్రామానికి చెందిన భువనగారి గిరిధర్ నాయుడు, హరికృష్ణ, అఖిల్ అనే వ్యక్తులకు తెలిపాడు.

అనంతరం బొల్లె మౌని బాబు హరికృష్ణ గిరిధర్ నాయుడులు కలిసి ఓ కారులో ఫాలో అయ్యారు. అంకిరావుపల్లి గ్రామ శివారులోని కేఎల్‌ఐ కాల్వ వద్ద రోడ్డుకు అడ్డంగా రాళ్లను వేసి కారును అడ్డగించారు. అనంతరం పొడవాటి కత్తి మరో సిమెంట్ రాళ్లతో బెదిరించి దారిదోపిడికి యత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే వారి నుంచి తప్పించుకున్నారు. అనంతరం అదే రోజు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు చిక్కారు. ఈ నేరస్తులంతా తాగుడుకు బానిసలుగా మారి జల్సాలకు అలవాటుగా మారి దారిదోప్పిడికి తరచూ పాల్పడేవారని గుర్తించారు.

మొత్తంగా వనపర్తి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో సుమారు 24 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. కర ప్రస్తుతం పాత కేసులలో దారి దోపిడీ చేసిన పది తులాల బంగారం 22 తులాల వెండితో పాటు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేస్తున్నారు. ఇందులో హరికృష్ణ అఖిల్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను మరోసారి విచారించి మరిన్ని కేసుల వివరాలు ఆధారాలను సేకరిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న వయసులో తాగుడుకు బానిసలుగా మారుతూ దేశాలకు అలవాటపడి తప్పుడు మార్గంలో పైనుంచి వద్దని ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. వారితో పాటు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ మహేష్, ఎస్సై హృషికేష్ ఉన్నారు.