కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 8 వేలు పైచిలుకు అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అబ్జర్వర్ సూపర్డెంట్లు పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు.