calender_icon.png 27 February, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

27-02-2025 03:46:05 PM

జిల్లాలోని 23 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకొనున్న 2022 మంది టీచర్లు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్(Teachers MLC Polling) ప్రక్రియలో భాగంగా గురువారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. సింగరేణి కాలరీస్ బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ బొల్లోరుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేయడం జరిగింది.జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 పోలింగ్ కేంద్రాలలో 2022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 20 22 ఓట్లకు, 14 84 మంది ఓటు హక్కును దీంతో73.39 శాతం ఓటింగ్ జరిగింది.