calender_icon.png 20 March, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఎస్ఐ సందీప్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

19-03-2025 08:33:26 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో 502.5 మార్కులను సాధించిన ఎస్సై సందీప్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యి మంచి మార్కులు సాధించినందుకు గాను సందీప్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా కష్టపడుతున్న ఎస్సై సందీప్ భవిష్యత్తులో కూడా మంచి విజయాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.