22-02-2025 08:54:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీస్ పనిచేస్తుందని అందులో పోలీసులందరు కూడా భాగస్వాములు కావడం వల్లనే ప్రజలకు రక్షణ కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సాయుధ దళాల వార్షిక పరేడ్(Annual Parade Of Armed Forces) శనివారం నిర్మల్ లో నిర్వహించగా వారి గౌరవం స్వీకరించిన ఎస్పీ బలగాల పనితీరుపై ప్రశంసలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం పోలీస్ శాఖలో కొత్త ఉద్యోగాలు కల్పించడం వల్ల సాయుధ పలగాల్లో యువత ఉద్యోగంలో చేరారని వారు విధి నిర్వహణ పట్ల అంకితభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి అవినాష్ కుమార్ రాకేష్ మీనా పోలీస్ సిబ్బంది ఉన్నారు.