నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో తన కుటుంబ ఉపాధి కోసం ఓ మహిళ ఆటోవృత్తిని ఎన్నుకొని జీవనం సాగిస్తుంది. శనివారం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్న సందర్భంగా లక్ష్మీ ఆటో నడుపుకుంటూ వెళ్తూ పోలీసులను చూసి ఆటో ఆపి వారికి నమస్కారం చేసింది. దీంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాకేష్ మీనా ఆమెను దగ్గరకు పిలిచి ఆటో నడుపుతున్న వైనంపై ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు ఆటో ద్వారా ఉపాధి పొందడం ఇతరులకు స్ఫూర్తిదయకమన్నారు. లక్ష్మీకి ఏ సాయం కావాలన్నా తమను అడగాలని పోలీసులు మహిళకు కోరారు.