మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా మండపాల వివరాలను నమోదు చేసుకుని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీడీ జానకి పేర్కొన్నారు. అప్లికేషన్ నమోదు చేయుటకు వాడవలసిన లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపంకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించింది. ఈ సమాచారం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని, ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని జిల్లా ఎస్పీడీ జానకి తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసులకి, 100కి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659360 సమాచారం అందించాలని సూచించారు. ఈ పండుగను అందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు.