calender_icon.png 23 December, 2024 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుతంగా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ డి.జానకి

16-09-2024 08:07:41 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు,  ప్రజలు గణేష్ నిమజ్జనం దృష్ట్యా, శోభయాత్ర నిర్వహిస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. శోభయాత్రలో DJ సౌండ్ BOX లను ఉపయోగించరాదని, ఇలా ఉపయోగించిన సౌండ్ బాక్స్లను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు మరియు కమిటీ సభ్యులు బాధ్యత వహించ వలెనని తెలిపారు. విద్యుత్ తీగలను మరియు వచ్చే పోయే వాహనాలను గమనించుకుంటూ యాత్రను నిర్వహించాలన్నారు.

శోభా యాత్రలో అశ్లీల నృత్యాలు గానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను గాని అట్టి పాటల్ని గాని ప్రదర్శించరాదని పేర్కొన్నారు. శోభా యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధము, ఇట్టి విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిమజ్జనం సమయంలో నీటి వద్ద తగు జాగ్రత్తలు పాటించవలెను మరియు నీటి వద్దకు చిన్న పిల్లలను రానీయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం చేయవలెను. పేర్కోన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదని తెలిపారు. కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదన్నారు.

ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదని, నిమజ్జన రూట్లలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి అందరూ సహకరించగలరు. ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.  నిమజ్జన సమయమున ఏమైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712658360 కి గానీ 100 లను సంప్రదించలనితెలిపారు. నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్‌ శాఖ, ఆర్‌ అండ్‌బీ శాఖల ఇతర అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు చేపట్టామని  జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు.