24 May, 2026 | 3:35 PM

Breaking News

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మెడికల్ కళాశాలకు పెట్టాలి   •   అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •  

వెహికిల్ పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

03-01-2026 12:05 AM

కామారెడ్డి, జనవరి 2,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని  వాహన విభాగంలో నూతనంగా వాహనాల పార్కింగ్ షెడ్డును నిర్మించారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర ఈ షెడ్‌కు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు.

సమర్ధవంతంగా సేవలు..

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేలా, క్రమబద్ధంగా నిలిపి ఉంచేలా ఈ షెడ్‌ను నిర్మించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాలకు లోనుకాకుండా పోలీస్ వాహనాలు భద్రంగా ఉండే విధంగా ఈ షెడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. పోలీస్‌శాఖ సమర్ధవంతంగా సేవలందించే విషయంలో వాహనాల భద్రత కూడా ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా..

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వాహనాలు తక్షణమే అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమని, అందుకే వాహనాలు నిలిపే సముదాయ షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, మోటార్  ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.