calender_icon.png 12 January, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ విధులు సవాళ్లతో కూడుకున్నవి

04-01-2025 11:10:02 PM

ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుండ్రు 

పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ డి జానకి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పోలీసుల విధులు ఎన్నో సవాళ్లతో కూడినవని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని అధిగమించడం కోసం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం జడ్చర్లలో  సైకాలజిస్ట్ డాక్టర్ పి. లక్ష్మణ్(Psychologist Dr. P. Lakshman)చే ప్రత్యేకంగా సెమినార్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ  డి.జానకి(District SP D.Janaki) మాట్లాడారు. 

 ప్రజా రక్షణ కోసం సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఒత్తిడిని అదుపులో పెట్టడం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని, పనితీరు కూడా మెరుగుపడుతుందన్నారు. పోలీసు కుటుంబాలకు మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, వ్యక్తిగత జీవితం ఉద్యోగం మధ్య సమతుల్యత సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అనంతరం సైకాలజిస్ట్ డాక్టర్ పి. లక్ష్మణ్  మార్గదర్శకంతో పోలీసు సిబ్బందికి ఒత్తిడి నిర్వహణ  పై పలు అంశాలు వివరిస్తూ, ఆయా ధ్యాన పద్ధతులు, పనిలో సమతుల్యత నిర్వహణ గురించి వివరించారు.