calender_icon.png 27 April, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీలు చేస్తే వదిలేది లేదు...

26-04-2025 08:18:58 PM

విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి...

చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ 25 తులాల 9 గ్రాముల బంగారం స్వాధీనం..

ఎవరు చూస్తలేరని తప్పులు చేయొద్దు..

కాలనీలలో సిసి కెమెరాలు ఏర్పాటుకు సచిన్దంగా ముందుకు రండి..

విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి జానకి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): చోరీలు చేసి కాలం గడుపుదామని తప్పుడు అడుగులు వేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడారు. ఈనెల మొదటి వారంలో బండమీదిపల్లి దగ్గర బండారి లింగం అనే వ్యక్తి ఇంట్లో తులం చేయను గోల్డ్ బిస్కెట్ గోల్డ్ రింగ్స్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసును పరిగణలోకి ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అప్పనపల్లి రైల్వే స్టేషన్ లో సాదరణ తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ క్రమంలో అమోల్ రాందాస్ అనే వ్యక్తి కొంత బంగారు వస్తువులతో పట్టుబడ్డాడు. బండారి లింగం అనే వ్యక్తి ఇంట్లో చోరీకి గురైన గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్స్ టెన్ గ్రామ్స్ లభించడంతోపాటు అతని పూర్తిస్థాయిలో విచారణ చేయగా అతని మిత్రులు సచిన్,ఆకాష్ బట్, ఆకాష్ ఇతరులతో కలిసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో చేసిన పలు చోరీలకు పాల్పడినట్లు అతను ఒప్పుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆరు నెలల కాలంలో 13 మార్లు రాత్రిపూట దొంగతనం చేసినట్లు చెప్పారు. ఇతనిపై మహారాష్ట్ర తో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. సుమారు 25 తులాల 9 గ్రాముల బంగారు ఆభరణను స్వాధీన పరచుకోవడం జరిగింది. బంగారంతో పాటు చోరీలకు ఉపయోగించబడే కట్టర్ ఐరన్ రాడ్ ఒక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాం. 

అమోల్ రాందాస్ పవర్  పై పలు కేసులు ఉన్నాయి...

పట్టుబడిన అమౌంట్ రాందాస్ పవర్ తన చిన్ననాటి నుంచి జల్సాలకు అలవాటు పడి గత 25 సంవత్సరాల నుండి వివిధ రకాల చోరీలు పాల్పడుతూ రైల్వే రాబరీ తో పాటు ఇతర ప్రాంతాల్లో చోరీలు చేస్తూ జీవనం సాగించారు. పలుమార్లు అరెస్టు కాబడి జైలు శిక్షణ కూడా అనుభవించారు. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. పలు రాష్ట్రాలలో ఇతనిపై వారెంట్స్ ఉన్నట్లు తెలిసింది. రెండు కార్లను సైతం సమకూర్చుకొని ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తూ ఇతర ఇతర ప్రాంతాలలో చోరీలు చేస్తూ తిరిగేవారు.

మరో ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు వారిని కూడా అరెస్టు చేసి ఏ మేరకు వారి దగ్గర చోరీకి పాల్పడిన నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిగా పెట్టింది. ఈమెకు మహబూబ్ నగర్, జడ్చర్ల రూరల్ పోలీసులు ప్రతి ఒక్క చెరువు తీసుకున్నారు. అనంతరం వీరికి ఎస్పీ రివార్డులను అందజేశారు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోవాలని, కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మరింత బాగుంటుందని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు గాంధీ నాయక్, సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్స్ ఉన్నారు.