calender_icon.png 22 October, 2024 | 6:04 PM

పోలీస్ జాగిలం "జూనో" ను అభినందించిన జిల్లా ఎస్పీ

22-10-2024 03:20:34 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల 16 నుండి 19వ తారీకు వరకు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్-2024 పోటీల్లో పేలుడు పదార్థాలు (ఎక్సప్లోజీవ్స్)ను కనిపెట్టే విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన జిల్లా పోలీస్ జాగీలం జూనో ను ఈరోజు ఎస్పీ రోహిత్ రాజ్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో మొత్తం 21 పోలీస్ జాగిలాలు పాల్గొనగా అందులో "జూనో" అత్యుత్తమ ప్రతిభను కనబరిచి బంగారు పతకాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. జూనో హ్యాండ్లర్ హుస్సేన్ ను కూడా ప్రశంసించారు. ఇదే విధంగా జాతీయస్థాయిలో కూడా తన ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి బంగారు పతకాన్ని సాధించే విధంగా శిక్షణను ఇప్పించాలని సూచించారు. బంగారు పతకం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినందుకు జూనో కు ఎస్పీ గారు రివార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఆర్ఎస్సై శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.