26-02-2025 12:50:51 AM
కలెక్టర్ ఎం. హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి): పవిత్ర రంజాన్ మాసం ్రప్రారంభమవుతున్నందున మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు హనుమంత రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజు మినీ మీటింగ్ హాలులో రంజాన్ మాసం పురస్కరించుకొని శాంతి సంఘ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సంబంధిత శాఖలకు కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
నమాజ్ వేళ లో కరెంటు ఉండేలా చూడాలన్నారు.రంజాన్ మాసం లో కరెంట్, మంచినీరు వంటి సౌకర్యాలు అందించడం జరుగుతుందన్నారు.,మసీదుల వద్ద పఠిష్టమైన పారిశద్య చర్యలు చేపట్టాలని, మంచినీరు సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ముఖ్యంగా ప్రార్ధనా సమయాలలో విద్యుత్ ప్రసారం ఉండే లా చూడాలని ఆదేశించారు. వార్డులలో మంచినీరు సమయానికి వచ్చే లా చూడాలన్నారు.
మంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునే రంజాన్ మాసం అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున నిబంధన లు దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలన్నా రు. మతసామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలపాలన్నారు. డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో, మసీదుల వద్ద అన్ని ఏర్పాటు లు చేస్తామని, రంజాన్ మాసంలో పూర్తి బందోబస్తు ఉంటుందని, సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని, అందరి సహకారంతో సామరస్య వాతావరణంలో రంజాన్ మాసం జరుపుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్.ఏ సి పి రాహుల్ రెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.