calender_icon.png 5 November, 2024 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్త్ ఎమర్జెన్సీగా జిల్లాను ప్రకటించాలి

30-08-2024 07:36:39 PM

ప్రజాసంఘాల డిమాండ్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): హెల్త్ ఎమర్జెన్సీగా జిల్లాను ప్రకటించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం డిఎంహెచ్ వో తుకారం భట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ వో తుకారం భట్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు సిహెచ్ సి, పిహెచ్ సిలలో రోగులకు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల ప్రభావం ఉండడంతో ఆస్పత్రులలో వైద్యుల సేవలను నిరంతరం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మలేరియా, డెంగ్యూ వ్యాధులతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం, మందులు అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు అప్పులు చేసి మరి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వసతి గృహాలలో విద్యార్థులు అనారోగ్యాలతో బాధపడుతున్నారని మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  డివై ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ ,కె.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్,టి ఏ జి ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, నాయకులు నిఖిల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు