calender_icon.png 18 March, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న వైరాలో జిల్లా రైతు సభ జయప్రదం చేయండి..

17-03-2025 05:49:32 PM

అడపా రామకోటయ్య..

వైరా (విజయక్రాంతి): వైరాలోని కమ్మవారి కల్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా 21 మహాసభలను పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ నాయకులు అడపా రామకోటయ్య పిలుపునిచ్చారు. వైరాలో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు రైతుల ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి రైతుల చైతన్యంతో పోరాటాలకు సమయుత్వం చేయనున్నట్టు వారు తెలిపారు.

పంటలు రుణమాఫీ రైతు భరోసా సంపూర్ణంగా అమలు చేసి రైతుల విశ్వాసాన్ని చాటాలని ప్రభుత్వానికి సూచించారు. మార్క్ పేడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి దళారీల చేతిలో బలికాకుండా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు రైతు సంఘం నాయకులు యామాల గోపాలరావు దొబ్బల కృష్ణ కొండ రామకృష్ణ నల్లమోతు నల్లమోతు నరసరావు బండారుపల్లి ముత్తయ్య ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.