calender_icon.png 3 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాస్కెట్ బాల్ రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా వాసులు

01-04-2025 11:56:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ క్లేరియన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారిగా హై కోర్ట్ జస్టిస్ పి నవీన్ రావు వ్యవహరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 20 మంది పోటీపడ్డారు. జిల్లాకు చెందిన చంద్రమోహన్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గెలుపొందగా, రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజులలో గ్రామీణ ప్రాంతాలలో సైతం బాస్కెట్ బాల్ గేమ్ అభివృద్ధికి దోహదపడుతామన్నారు. తమ గెలుపుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ పృద్వీశ్వర్ రెడ్డిలతో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.