calender_icon.png 2 May, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రస్మా రాష్ట్ర కార్యవర్గంలోకి జిల్లా వాసి

15-04-2025 12:21:32 AM

మంచిర్యాల, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : హైదరాబాద్ కొంపల్లిలోని కాస్ హోటల్ లో ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ మొదటి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి 25 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులతో పాటు ఆయా జిల్లాలలోని ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు 200 మందికిపైగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాల సమస్యల పైన, రాష్ట్ర కార్యవర్గ డైరీ గురించి, ఫీజు రెగ్యులేటరీ బిల్లు, దాని పరిణామాలపై చర్చ, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు, వివిధ సబ్జెక్టు టీచర్లకు, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి, 2025-26 అకాడమిక్ క్యాలెండర్ గురించి, వివిధ కమిటీల ఏర్పాటు సంబంధించిన అంశాల గురించి ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు.

ఆ తర్వాత జరిగిన రాష్ట్ర కార్యవర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లా నుంచి ఆదిత్య హై స్కూల్ (సీసీసీ) కరస్పాండెంట్ గోపతి సత్తయ్యకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించింది. గోపతి సత్తయ్యని ట్రస్మా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రాపోలు విష్ణువర్ధన్ రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్దయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి చంద్రమోహన్ గౌడ్, రాష్ట్ర నాయకులు కస్తూరి పద్మ చరణ్, యార్లగడ్డ బాలాజీ, సురభి శరత్ కుమార్, రామ్ వేణు, అఖిలేందర్ సింగ్, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు.