04-03-2025 12:31:30 AM
అభినందించిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
ఆదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : రాష్ర్ట స్థాయి 3వ పోలీసు క్రీడల్లో జిల్లా నుండి పాల్గొన్న పోలీసు సిబ్బందికి 8 క్రీడల్లో 10 పథకాలను సాధించి జిల్లా కీర్తిని పెంపొందించారు. ఈ 10 పథకాలను ఏడుగురు సిబ్బంది సాధించడం హర్షనీయం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం స్థానిక పోలీసు జిల్లా కార్యాలయంలో సిబ్బంది ని సోమవారం ఆహ్వానించి సాధించిన పథకాలను ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరంగా కఠోర శ్రమ వల్ల భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించవచ్చని అన్నారు. పోలీస్ సిబ్బంది రూప యోగ లో రాష్ర్టస్థాయిలో బంగారు పతకం, మీర్ సింగ్ రెజ్లింగ్ లో కాంస్య పథకం, ముఖేష్ కుమార్ కరాటే లో 2 రజత పథకాలు, రుచిత జావలిన్ త్రో లో రజత పథకం, మీర్ సింగ్, ఎండి నస్మోద్దీన్ లు వెయిట్ లిఫ్టింగ్ లో రజత పథకాలు, పూజ, రోహిణి లు పరుగు లో రజత పథకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.