07-03-2025 05:08:30 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సందర్శించారు. అనంతరం ఎంపీడీవో చిన్నారెడ్డి తో కలిసి మండలంలో ఉన్న వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం అనంతసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయన్ని సందర్శించి గ్రామంలో పన్నుల వసూలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 పథకం కింద ప్రజలు మార్చ్ 31వ తారీకు వరకు చెల్లిస్తే వారికి 20% శాతం రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.